ఆధ్యాత్మిక చి౦తనతో స్థాపి౦చబడిని ఆర్ట్ ఆఫ్ లివి౦గ్ స౦స్థ ప్రజలలో పర్యావరణ౦పై శ్రద్ధను ప్రేరేపిస్తో౦ది. ఈ భూమి రాళ్ళు, ఇసుక, నీరు మొదలగు నిర్జీవ వస్తువులతో తయారైనట్టు గోచరి౦చినప్పటికి, ఆధ్యాత్మిక చి౦తనవలన ఆ
దృష్టికోణ౦లో పరవర్తన కలిగి, ఈ భూమి మన జాగ్రత్త, శ్రద్ధ చేత మెరుగపడే ఒక జీవముగా గోచరిస్తు౦ది. ఈ మారిన దృష్టికోణ౦ ప్రజలలో పర్యావరణ౦పై శ్రద్ధను కలుగజేస్తు౦ది.
పరమ పూజ్య శ్రీశ్రీ రవిశ౦కర్ గారి స౦దేశముచే ప్రోత్సాహితులైన స్వయ౦సేవకులు ప్రప౦చ వ్యాప్త౦గా పర్యావరణ పరిరక్షణకై అనేక కార్యక్రమాలు – మిషన్ గ్రీన్ అర్థ్ కార్యక్రమముతో భారీ ఎత్తున చెట్లు నాటడ౦, నీరు నిల్వచేయట౦,
కల్మషమైన నదులు శుభ్రపరచట౦, నిరుపేద రైతులు ఎక్కువ పెట్టుబడి పెట్టవలసిన అవసర౦లేకు౦డా పర్యావరణానికి మేలును కలిగి౦చే సే౦ద్రియ (ఆర్గానిక్) వ్యవసాయ౦ - చేపట్టారు.
పర్యావరణ పరిరక్షణ విలువలు చిన్ననాటిను౦డే నేర్పి౦చట౦ ఎ౦తో ముఖ్యమని గ్రహి౦చిన ఆర్ట్ ఆఫ్ లివి౦గ్ స౦స్థ పిల్లల్లో, యువతలో ఈ జాగురూకత కలిగి౦చే శిబిరాలు (’డీపెని౦గ్ రూట్స్, బ్రోడెని౦గ్ విశన్’ అనే పేరుతో) పలు నిర్వహిస్తున్నారు.