కోపాన్ని నియంత్రించడానికి చిట్కాలు

కోపం రావడం సరికాదని మీకు మీరు ఎన్నో సార్లు చెప్పుకున్న ఆవేశంలో కోపాన్ని అదుపులో ఉంచుకోలేము.
చిన్నప్పుడు పుస్తకాలలో తన కోపమే తనకు శత్రువని చదివుంటాం. కానీ కోపాన్ని నియంత్రించడం అన్నది ప్రశ్న. దానికోసం మనం ఏం చేయాలి ?

కోపాన్ని అర్థం చేసుకోవడం

మన చుట్టూ ఎవరైనా సరిగ్గా పని చేస్తే దాన్ని మనం స్వీకరించలేమని గమనించుంటారు కదా. ఏవరైన తప్పుడు పని చేస్తే క్షణికం లో కోపం ఒక అల మాదిరిగా వచ్చివెళ్తుంది. మళ్ళీ ఆ సంఘటనలని తలుచుకుంటూ బాధ పడతాము. కోపం లో మన జాగరూకతని కోల్పోతాము. మొదటగా తెలుసుకోవలసింది కోపం ద్వారా అసంపూర్ణత ని తొలగించలేము. ఆ పరిస్థితిని స్వీకరిస్తూ, జాగరూకతతో సరిదిద్ధుకోవచ్చు. ఇలా చేయడంకన్నా చెప్పడం చాలా సులువని అనుకొనవచ్చును. మరి ఆ మనోస్థితి ని పొందడం ఎలా ? మనోభావాలని అదుపులో ఉంచడం అంత తేలికైన విషయం కాదు. అందుకే మనకు కొన్ని ప్రక్రియ సాధనలు అవసరం.
కోపం రావడానికి మూడు ముఖ్యకారణాలు

  • • శరీరానికి మరియు మనస్సు కు సరైన విశ్రాంతి లేకపోవడం.
  • • పాత జ్ఞాపకాలు మనసులో ఇబ్బంది కల్గించడం.
  • • తప్పులని లేక అసంపూర్ణతని అంగీకరించలేకపోవడం.

ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం.

శరీరం మరియు మనస్సు ని ఎలా విశ్రమింపచేయాలి ?

మన తీసుకున్న ఆహారమే మన శరీరం తయారవుతుంది.

అప్పుడప్పుడు మీరు చాలా ఉల్లాసంగా మరియు ఉత్సాహంగా ఉంటారు. కొన్ని రోజులో చాలా అలసిపోయినట్లు గమనించారా ? తిన్న ఆహారం మనసు మరియు మనోభావాలపై చాలా ప్రభావితం చేస్తుంటాయి. కొన్ని రకాల ఆహారపదార్థాలు మన శరీరం మరియు మనసు అలసిపోయే విధంగా చేస్తాయి. వాటిని తీసుకోవడం తగ్గిస్తే కోపాన్ని అదుపు లో ఉంచవచ్చు. సాధారణంగా అవి మాంసాహారం, మసాలా మరియు నూనె ఎక్కువగా వున్న పదార్థాలు.

విశ్రమించడంలో ఉన్న శక్తి ని అనుభవించండి!

ఒక రోజు రాత్రి పడుకొన లేదనుకోండి తర్వాతి ఉదయం ఎలా ఉంటుంది ? తరచుగా కోపం వస్తుంది కదా? మన శరీరంలోని అలసత్వం మరియు అవిశ్రాంత వల్ల  మనం అసహనానికి మరియు ఆందోళనకి లోనవుతాము.  6 నుంచి 8 గంటల నిద్ర అవసరం. ఇది శరీరానికి మరియు విశ్రమాన్ని ఇవ్వడమే కాక ఆందోళనకి గురైయే అవకాశాన్ని తగ్గిస్తుంది.

యోగాసనాలు చాలా సహాయం చేస్తాయి!

10 నుంచి 15 నిమిషాలు యోగాసనాలు చేస్తే శరీరంలోని అలసటని తగ్గిస్తుంది. శారీరక వ్యాయామం, యోగాసనాలను పోలిస్తే ఆసనాలు శ్వాస తో అనుసంధానం చేయబడతాయి. అవి మనలో సత్తువని పెంచుతూ శారీరక దృఢత్వానికి తోడ్పడతాయి.
ప్రియా శర్మ అనుభూతి “ కొన్ని రోజుల్లో నేను చాలా ఒత్తిడి కి గురైనప్పుడు, శరీరం చాలా బిరుసుగా అనిపించేది. అది నన్ను ఆందోళనకి గురిచేస్తూ కోపం రావడానికి ప్రేరేపించేది. యోగా శరీరాన్ని వదులుగా ఉంచుతూ, మనసు ని ప్రశాంతకరంగా మరియు ఆనందకరంగా ఉంచుతుంది.”

ఎల్లవేళలా పని చేసే పరిష్కారం

కొన్ని దీర్ఘమైన శ్వాసాలను తీసుకోవడం ద్వారా కోపం నుంచి విముక్తి పొందగలం. మీకు ఎప్పుడైనా కోపం వస్తే వెంటనే కళ్ళు మూసుకుని దీర్ఘమైన శ్వాసాలను తీసుకొని మనసులో వచ్చిన మార్పుని గమనించండి. శ్వాస మీ ఒత్తిడి ని
తొలగించి మనసుని శాంతపరుస్తుంది.

ఒక 20-నిమిషాల అంతర్ముఖ ప్రయాణం

నిరంతర యోగా, ప్రాణాయామ సాధన మరియు తీసుకునే ఆహారంపై శ్రద్ద వల్ల విశ్రాంతి పొందవచ్చు కానీ శాంతి భరితమైన మరియు సమతుల్యమైన మనసుని పరిరక్షించుకోవడం ఎలా ? రోజుకి కేవలం 20-నిమిషాల ధ్యానమే ఈ ప్రశ్నకి సమాధానం.

మీరు హ మ్ మ్ అనే ప్రక్రియ చేశారా ?

ఇది కోపానికి త్వరిత పరిష్కారం. 1 లేక 2 నిమిషాల ప్రక్రియ కానీ వెంటనే మీమల్ని శాంతింపచేస్తుంది.
క్రింది వీడియో చూసి దాని అభ్యసించవచ్చు.

To be continued >>

I

 
Founded in 1981 by Sri Sri Ravi Shankar,The Art of Living is an educational and humanitarian movement engaged in stress-management and service initiatives.Read More