మీకు తెలుసా మనం కొంచం సమయాన్ని ధ్యానం కోసం కేటాయిస్తే మనకు ఎంత మంచి అనుభూతి కలుగుతుందో ?
మీ సౌకర్యం కోసం ఈ కింద చిట్కాలు ఇవ్వడం జరిగింది. ఇవి మీకు ధ్యానం చెయ్యడం లో సహాయ పడతాయి. మీరు ఈ చిట్కాలు చదివిన తరువాత, ధ్యానం చెయ్యడానికి ఈ క్రిందవున్న 'గైడెడ్ మెడిటేషన్' ని క్లిక్ చెయ్యండి
#1 మీకు అనుకూలమైన సమయాన్ని చూసుకోండి
ధ్యానం అనేది పూర్తిగా విశ్రాంతి సమయం. కాబట్టి దీనిని మీకు పూర్తిగా అనుకూలమైన సమయంలో చెయ్యాలి. కాబట్టి మీకు ఆటంకము కలగని సమయాన్ని, ప్రాంతాన్ని చూసుకోండి. మాములుగా సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయాలు ధ్యానం చెయ్యడానికి అనుకూలంగా వుంటాయి.
#2 ఒక నిశబ్ధమైన ప్రదేశాన్ని చూసుకోండి
మీకు అనుకూలమైన సమయాన్ని చూసుకొన్న మాదిరిగానే మీకు ఆటంకము కలగని ప్రదేశాన్ని చూసుకోండి. ఒక నిశ్శబ్దమైన మరియు ప్రశాంతమైన పరిసరాలు మనకు ధ్యానం యొక్క గొప్ప అనుభూతి కలగడానికి దోహదపడాయి.
#3 మీకు అనుకూలమైన భంగిమ లో కూర్చోండి
మీ భంగిమ కూడా మీ ధ్యానం మీద ప్రభావం చూపుతుంది. మీరు ప్రశాంతంగా, సౌకర్యవంతంగా, స్థిరంగా ఉండేలా చూసుకోండి. మీ వెన్నెముక నిటారుగా ఉండేలా నేరుగా కూర్చోండి. మీరు ధ్యానం చేసినంతసేపు కళ్ళు మూసుకొని భుజములు మరియు మెడ ప్రశాంతంగా ఉంచుకోండి. పద్మాసనం లో కూర్చొని ధ్యానం చెయ్యమని మన పురాణాలు చెబుతున్నాయి.
#4 మీ పొట్టను ఖాళీగా ఉంచుకోండి
మీరు భోజనం చెయ్యడానికి ముందు ధ్యానం చెయ్యడం మంచిది.
ఒకవేళ మీరు భోజనం చేసిన తరువాత ధ్యానం చేస్తే మీకు నిద్ర రావచ్చు. ఏది ఏమైనా కూడా మీరు ఆకలిగా వున్నపుడు ధ్యానం చెయ్యడానికి ప్రయత్నించకండి.
ఎందుకంటే మీ ద్యాసంతా ఆకలి మీదకు వెళుతుంది. ఐతే మీరు భోజనం చేసిన 2 గంటల తరువాత ధ్యానం చెయ్యవచ్చు.
#5 సులభమైన వ్యాయామం తో ప్రారంభించండి
సులభమైన వ్యాయామం లేదా సూర్య నమస్కారాలు చెయ్యడం వలన రక్త ప్రసరణ జరుగుతుంది. దీనివల్ల మీ శరీరం లో వున్నా జడత్వం పోయి శరీరం తేలికగా అనిపిస్తుంది.
ఇలా చెయ్యడం వలన మీరు ధ్యానం లో చాలాసేపు కూర్చోగలరు.
# 6 కొన్ని దీర్ఘమైన శ్వాసలు తీసుకోండి
దీర్ఘమైన శ్వాసలు తీసుకోవడం వలన మీరు ధ్యానం బాగా చెయ్యగలరు. అలాగే ధ్యానం చెయ్యడానికి ముందు నాడి శోదన ప్రాణాయామం చెయ్యడం కూడా మంచిది.
దీనివలన మీ శ్వాస క్రమభద్ధమై మీకు ప్రశాంతత కలుగ చేస్తుంది.
#7 మీ ముఖము పైన చిరునవ్వు వుంచండి
మీరు చిరునవ్వు తో ధ్యానం చెయ్యడం వలన మీరు ప్రశాంతమైన అనుభవం పొందగలరు.
#8 నెమ్మదిగా కళ్ళు తెరవండి
మీరు ధ్యానం చెయ్యడం పూర్తి అయిన తరువాత కంగారు పడకుండా నెమ్మదిగా మీ పరిసరాలు గుర్తుకు తెచ్చుకుని నెమ్మదిగా కళ్ళు తెరవండి.