సహజ సమాధి ధ్యానములో శ్రమ లేని విధంగా ధ్యానము ఎలా చేయవచ్చు అనేది నేర్పబడుతుంది. ఈ ప్రక్రియ వల్ల మన చైతన్య వంత మైన మనసును సులభముగా లోతైన శాంత స్వభావానికి ఎలా తీసుకు రాగల మనేది తెలుసుకోగలము. ప్రకృతి సిద్ధంగా, శరీరము మరియు మనసును దీర్ఘమైన విశ్రాంతి వైపు తీసుకు వచ్చి మన లో వున్న ఒత్తిడి తొలగించి అనంతమైన శాంతి, సంతోషము మరియు సృజనాత్మకత అనుభవించగలుగుతాము. ఈ ప్రక్రియ ప్రతి ఒక్కరూ నేర్చుకోవచ్చు అలాగే దీనికి ఏకాగ్రత లేదా మానసిక శ్రమ అవసరం లేకుండానే నేర్చుకోవచ్చు. ఈ ధ్యానము యొక్క ప్రయోజనాలు మనకు వెంటనే అనుభవం పొందడంతో పాటు క్రమంగా ఎక్కువ ఆనందాన్ని మరియు విశ్రాంతిని కలుగచేస్తుంది.
ఈ ధ్యానం చేయటానికి మనం ఒక సారి నేర్చుకున్నతరువాత ఒక నిర్దిష్ట స్థలము గాని లేదా మరొకరి మార్గదర్శనము కాని అవసరం లేదు. ఈ ధ్యానం మనము ప్రయాణం చేస్తున్న సందర్భాలలో బస్సులో, రైలులో లేదా విమానంలో అలాగే ఆఫీసుల్లో లేదా మరెక్కడనైనా చేయవచ్చు.కళ్ళు మూసుకుని సులభంగా ధ్యానం లోకి వెళ్లగలుగుతాము.
వ్యక్తిగతమైన మార్గదర్శనము
సహజ సమాధి ధ్యానము అనేది ఎన్నో వేల సంవత్సరాల పురాతనమైనది. ప్రశిక్షకులైన అనుభవజ్ఞులచే ఈ ధ్యానము నేర్పించబడుతుంది. దీనితో పాటు మరెన్నో వివరాలు పంచుకొంటారు. తదుపరి ఎప్పుడైనా మనకు మరిన్ని వివరాలు తెలుసు కోవాలను కొంటే మన శిక్షకులు మనకు అందుబాటులోఉంటారు.
- ప్రయోజనాలు
- మెళకువలు
- మంచి అభిప్రాయాలు
- " ఈ నిగూఢమైన ధ్యాన ప్రక్రియ వల్ల సమాధి అవస్థను అనుభవించ వచ్చు అలాగే చిరకాలము ఉండే ఆనందాన్ని మరియు శక్తిని ఇస్తుంది. మనలో ఉన్న ప్రేమ తత్వాన్ని ఎల్లప్పుడూ వ్యాప్తి పరచే విధంగా ఈ ధ్యానం మనను ఉన్నత శిఖరాలకు తీసుకువెళుతుంది" -- శ్రీ శ్రీ రవిశంకర్, ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు
- మనలో దాగి ఉన్న ఈ శాంతి ని మరియు సమాధి అవస్థను కనుక్కుందాం!
- మన గురించి తెలుసు కొందాం అలాగే మనలో స్పష్టత పెంచుదాం!
- మనలోని శక్తి సామర్థ్యాలను పెంచుదాం!
- సృజనాత్మకతను పెంచుదాం!
- During the Sahaj Samadhi course you will receive personalized instructions from qualified teachers who have been qualified by Sri Sri Ravi Shankar.
- Sahaj Samadhi Meditation is a natural, effortless technique with immediate results and cumulative benefits.
"My meditation is my time for myself, where I can let go and just be. And when I’m done, I feel rested, refreshed, joyful and peaceful…ready to take on all of life’s demands. Meditation has really helped me lower my stress and anxiety levels and has given me the ability to laugh even in times of crisis. "
-- Soham, Commercial Real Estate Broker"After taking the Sahaj course I feel an overall improvement in my energy although I sleep much less than I used to. I’m also more present for the everyday moments of my life and in my relationships with friends and family. I find that I’ve become a lot calmer and less reactive to events that would have bothered me before and have even noticed an increase in my creativity."
-- Raphael, Branding and Marketing