జ్ఞానాన్నీ గొప్పగా ప్రభావితంగా అందజేయడానికి కథారూపం ఎంతో అనువైనది. అందుకే మనం కథ ద్వారా మొదలు పెడదాము.
పూర్వము ఒకప్పుడు ఋషులుమునులు విష్ణువు వద్దకు వెళ్ళి నీవు ‘ధన్యంతరి’ అవతారము ఎత్తిఆయుర్వేదము ద్వారా అనారోగ్యాన్ని తగ్గించడానికి ప్రయత్నించినప్పటికీ ప్రజలు ఇంకా అనారోగ్యం పాలవుతున్నారుఅని తెలిపి, అలా అనారోగ్యం పాలు కాకుండా ఉండడానికి ఉపాయం చెప్పమన్నారు.
కొన్ని సార్లు కేవలం శారీరక అరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం, భావోద్వగాలనుకూడాచూసుకోవలసి ఉంటుంది. ఉదా:- కోపము, కామము,అత్యాస,ఈర్ష్య, ఇటువంటి మలినాలనుండి బయట పడడానికి ఏమి చేయాలి? మార్గమేది?
శేషతల్పం మీద ఉన్న విష్ణువు దగ్గరకు వెళ్ళిన ఋషిమునులకు ఆదిశేషువునిఅప్పగించాడు (జ్ఞానానికి ప్రతీకగా). ఆ ఆదిశేషుడే భూమి మీద మహర్షి పతంజలిగా అవతరించాడు. కాబట్టి ఈ పతంజలే ప్రపంచానికి యోగా జ్ఞానాన్ని యోగసూత్రాల రూపంలో అందించాడు.
పత౦జలి వెయ్యిమంది శిష్యులు౦టే కాని ఈ యోగసూత్రాలను అందించలేనని చెప్పాడు. భారత దేశంలోని వింధ్య పర్వతానికి దక్షిణానవెయ్యిమంది శిష్యులు చేరారు.
అంతేకాకుండా వారికి పతంజలి ఒక షరతు పెట్టాడు. అది ఏమిటంటే పత౦జలి మహర్షికి శిష్యులకి మద్య ఒక తెర కట్టి, భోదన జరిగన౦తసేపు ఎవ్వరూ తెర ఎత్తి చూడకూడదు, ఎవ్వరూ బయటకు వెళ్ళకూడదని నిర్ధేశించాడు.
పతంజలి తెర వెనుకనుండిమౌన౦గా వెయ్యిమంది శిష్యులకు జ్ఞానాన్ని ప్రసరింపచేసాడు. ఇంకా ఈ వెయ్యిమంది కూడ ఇచిన జ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్నారు. ఇది ఒక అధ్భుతచర్య. ఈ జ్ఞానాన్ని ఎలా ఆకళింపు చేసుకున్నామని శిష్య్లు తమలో తాము ఆశ్చర్యపోయారు. ఒక్క మాట కూడ లేకుండా గురువు గారు తెర వెనుకనుండిఇంతమందికి జ్ఞానాన్ని ఎలా ప్రసరింపచేసారన్న విషయం వాళ్ళకు నమ్మశఖ్యం కాలేదు.
అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రతి ఒక్కరు కూడ వారిలో ఉత్పన్నమైనటువంటి అసామాన్య శక్తి, అసామాన్యమన ఉత్సాహాన్ని అనుభవించారు. ఈ శక్తిని వారు తమ శరీరంలో ఇముడ్చుకోవడం కష్టమైనది. అయినప్పటికీ వారు గురువు శాసనాన్ని పాటించారు.
ఇంతలో ఒక చిన్న కుర్రవాడు లఘుశంక(మూత్ర విసర్జనకు) తీర్చుకోవడానికి బయటకు వెళ్ళవలసి వచ్చింది. ఆ పిల్లవాడు నిశ్శబ్దంగా వెళ్ళి రావచ్చని గది బయటకు వెళ్ళాడు. ఇంకొక పిల్లవాడికి గురువు తెర వెనుక ఏమి చేస్తున్నాడో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. అది చూడదలచాడు.
ఆ పిల్లవాడు తెర ఎత్తాడా? ఏమి జరిగి ఉంటుంది? వచ్చే బుధవారం పతంజలి యోగా జ్ఞానం క్లాసుల్లో తెలుసుకుందాము.
ఈ కథ నుండి మీరు ఏమి గ్రహించార?
ఈ కథ చాలా గాఢమైనది. మన పురాణాలు ఇటువంటి కధవలన కలిగే ప్రశ్నలకు సమాధానాలు వివరి౦చవు. దీనిని మనమే తెలుసుకోవాలి. కాబట్టి మనందరం ఏమి గ్రహించాము?
ఏమి మాట్లాడకుండగా గురువు జ్ఞానాన్నిఎలా ప్రసరింప చేసాడు?
తెర యొక్క విశిష్టత ఏమిటి?