మన స్నేహభావాన్ని మన కుటుంబం వరకే పరిమితం చేయకుండా మన సమాజాన్ని కూడా మనలో ఒక భాగంగా చేసుకుని ఎలా ఆహ్వానిద్దాం!
మన దగ్గర ఏముంటే మనం దానినే మిగతా వారికి పంచగలం.
మన కుటుంబం మరియు మన సమాజం ఆనందంగా ఒకే వ్యవస్థలాగ ఉండాలంటే మనం ముందుగా ఇవి రెండూ మనకు సంభంధిచినవే అనే భావన మనకు ఉండాలి.
ఆర్ట్ అఫ్ లివింగ్ యొక్క ప్రత్యేకమైన, శక్తివంతమైన శ్వాస ప్రక్రియల సహాయంతో స్నేహతత్వం, ఆనందం మనలో ఎలా తీసుకురాగలం అనేది నేర్చుకోవచ్చు.
మనయొక్క భావోద్వేగాలు వదిలి ప్రేమతో ఎలా ఉండగలం!
మనమందరము జీవితంలో ఎన్నో సందర్భాలలో ఇబ్బందులు ఎదుర్కొంటాం అలాగే భావోద్వేగాలకు లోనవడం జరుగుతూ ఉంటుంది.ఆ సమయాలలో మనము మాట్లాడే మాటలు కానీ, మనము చేసినటువంటి చేష్టలు గానీ సరియైనవి కావని తరువాత మనస్తాపం చెందుతూ ఉంటాం.మన బళ్ళలో గానీ లేదా ఇళ్ళలో గానీ మనము కోపాన్ని ఎలా నిగ్రహించాలి మరియు దుఃఖాన్ని, ప్రతికూల భావోద్వేగాలను ఎలా అధిగమించాలనే విషయాలను నేర్పడంలేదు.
సరిగ్గా ఇక్కడే ఆర్ట్ అఫ్ లివింగ్ యొక్క శ్వాస ప్రక్రియలు మనకు దోహద పడుతాయి. మన మనసులో ఉన్న ప్రతి లయలకూ అనుగుణంగా శ్వాస లో ఒక ప్రత్యెక లయ ఉంటుంది. అందువల్ల మనము ఎప్పుడైతే మన మనసును నిగ్రహించలేమో, శ్వాస లోని లయల ద్వారా సులభముగా మనసుని నిగ్రహించవచ్చు. మన శ్వాస యొక్క సామర్త్హ్యాలను తెలుసుకోగలిగితే మనము మన ఆలోచనలని మరియు భావాలనీ ఎలా నిగ్రహించవచ్చు అని తెలుసుకోగలం.దీనితో పాటే కోపాన్ని ప్రతికూల భావోద్వేగాలను ఎలా అధిగమించాలి మరియు ఎప్పుడు కావాలంటే అప్పుడే ఎలా వదిలేయగలం అని కూడా తెలుసుకోగలం.
ఆర్ట్ అఫ్ లివింగ్ కోర్సులో నేర్పించబడే సుదర్శన క్రియ సాధన ద్వారా ప్రతికూల భావోద్వేగాలను ఎలా సులభతరంగా అధిగమించవచ్చు అనేది నేర్పించబడుతుంది. ఈ ప్రక్రియల ద్వారా మనము ఒత్తిడి మరియు కోపాన్ని ఎంతో సులభముగా తగ్గినట్లు తెలుసుకోగలము. పరిస్థితులను బట్టి ఎలా మెలగాలి అనేది సులభతరమవుతుంది. ఆవేశంలో క్షణికమైన నిర్ణయాలు కాకుండా పరిస్థితులకు అనుగుణంగా సరియైన నిర్ణయాలు తీసుకునే శక్తి యుక్తులను సమకూరుస్తాయి.
ప్రేమోద్వాగాలను ఎల్లప్పుడూ తాజాదనంతో, జీవిత కాలం ఉంచుతూ, క్షణికమైన భావోద్వేగాలకు లోను కాని విధంగా జీవితాన్ని హాయిగా ఆనందకరంగా అందరితోనూ గడపడానికి సహాయపడుతుంది.
ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవటం!
" నా మాటలకు ఆ అర్థం కాదు. నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు ?.."
కొన్నిసార్లు మనము తెలియకుండానే తప్పుగా మాట్లాడుతూఉంటాము. దైనందిన ఒత్తిడుల వల్ల మనము అనుకున్నదానికి, మాట్లాడే దానికి, చేస్తున్న దానికి సంభంధం ఉండకుండా, పక్క వారిని మనలో ఒకడుగా చూడకుండా ఉంటాము.
ఒత్తిడిని ఎలా ఆధిగమించగలమో తెలుసుకొంటే మనము పరిసర పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకోవడమే కాకుండా మన చుట్టూ ఉన్న వారితో ఎలా మెలగాలి, వారిని ఎలా గౌరవించాలి అని తెలుసుకోగలము. దీనితో ఎదుటి వారు మనకు కూడా గౌరవమర్యాదలు ఇస్తారు. మనము చెప్ప దలచు కొన్న విషయాలు ఎలా మాట్లాడాలి అనేది తెలుసుకోగలము.
మనము ఒక విత్తనము సరిగ్గా నాటితేనే అది మొలకెత్తుతుంది. లేని పక్షంలో విత్తనము మరీ లోతుగా నాటినా లేదా మట్టి పైన వేసినా మొలకెత్తడం కష్టము. విత్తనము భూమిలో కొంచెం లోతుగా నాటితేనే మొలకెత్తి పెరగటం చూస్తాం. అదే విధంగా ప్రేమ అనేది పెరగాలంటే అదే విధంగా ప్రేమ అనేది పెరగాలంటే దానిని బయట చూపాల్సిన పని లేదు అలాగని పూర్తిగా దాచాల్సిన అవసరము కూడా లేదు. ధ్యానం చేయడం వల్ల ప్రేమ అప్రయత్నంగా దానికదే వ్యక్తమవుతుంది.
ఆర్ట్ అఫ్ లివింగ్ ప్రక్రియల సహాయంతో మంచి విశ్రాంతి అనుభవించటమే కాకుండా ఒత్తిడి లేకుండా జాగరూకతతో మరియు మన చుట్టూ ఉన్న వారితో సున్నితత్వంతో మెలగగలము. దీనివల్ల మిగతా వారు మనల్ని సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారు.
మన చుట్టూ ఉన్నవారికి శాంతి, ప్రేమ మరియు సంతోషాన్ని పంచటం కోసం మనము ఒకడుగు ముందుకు వేద్దాం!
