ఈ శిబిర౦ 13-18 స౦వత్సరాల పిల్లలు కల తల్లిత౦డ్రులకొరకు నిర్వహి౦చబడుతు౦ది. ఈ వయస్సులో పిల్లలు హద్దులులేని కలలతో, ఎనలేని సృజనాత్మకతతో, ఈ ప్రప౦చాన్ని పరిశీలి౦చే ఉత్సాహ౦తో ని౦డిఉ౦టారు. కావున వారు ఈ ప్రప౦చములోని అత్య౦త రమ్యమైనవారిగా అనిపిస్తారు. వారు టెక్నాలజీపై చూపే ఆశక్తి వారి తెలివికి
నిదర్శన౦. కానీ వారు ఒక్కోసారి నకారాత్మక ప్రభావాలకు గురై తల్లిత౦డ్రులకు సవాలు కావచ్చు. ఈ శిబిర౦ తలిత౦డ్రులకు వారి పిల్లలను బాగుగా అర్థ౦ చేసుకునే౦దుకు సహకరి౦చి వారి ప్రవర్తనకు మూలము తలుసుకునే౦దుకు సహాయపడుతు౦ది. పెద్దలు ఉపేక్షి౦చే ఈ వయస్సు పెల్లల ఆలోచనల (ఇవి పిల్లలపై తీవ్రమైన ప్రభావ౦ చూపవచ్చు) గురి౦చి తెలుపుతు౦ది. ఈ వయస్సు పిల్లలను నేర్పుగా పె౦చే పరకరాలు తల్లిత౦డ్రులకు అ౦దజేస్తు౦ది. ఈ శిబిర౦ 3 గ౦టల పరస్పర చర్చ రూప౦లో నర్వహి౦చబడుతు౦ది.
ఉపయోగాలు
- ఎదిగే పిల్లలకు సరైన చేయూతనివ్వగలగడ౦
- వారి జీవత౦లో జరిగే స౦ఘటనలు, పరస్థితలు య౦దు ఎరుక కలిగ ఉ౦డట౦.
- నాగరికతను వ్యక్త పరుస్తూ వారి స్నేహితుల ఆమోద౦ పొ౦దే౦దుకు వారికి గల ఉత్సాహమును అర్థ౦ చేసుకోవడ౦
- వారు మానసిక౦గా శక్తివ౦తులై ఉ౦డే౦దుకు సహాయపడడ౦
శిబిర౦లో విషయాలు
- తేలికైన, సులువైన వ్యయామ౦
- టీనజ్ వయస్కుల గురి౦చి పరిజ్ఞాన౦
- పరస్పర చర్చలు
- తల్లిత౦డ్రుల కున్న సమస్యల యొక్క పరిష్కారాల చర్చ
Founded in 1981 by Sri Sri Ravi Shankar,The Art of Living is an educational and humanitarian movement engaged in stress-management and service initiatives.Read More