మీ పిల్లలు తమ ఆత్మగౌరవం మరియు ఇతరుల యందు గౌరవం పెంపొందింకోనుటకు దోహద పడండి. ఈ కార్యక్రమంలో బోధించే సాధారణ శ్వాస ప్రక్రియలు మరియు సుధార్శనక్రియ, మీ పిల్లలలో కల భయము, ఆందోళన, నిరాశ, అసూయ, ప్రతికూల భావావేశాలను అధిగమించడానికి సహకరిస్తాయి.
ఈ మొత్తం కార్యక్రమం ఆటలాగా, అప్రయత్నంగా నిమగ్నమయ్యేలా, సరదాగా ఉంటుంది. అన్ని వ్యాయామాలు మరియు ప్రక్రియలు ఈ వయస్సు వారికి ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.
అతి తేలికపాటి సిధ్ధాంతాల ద్వారా జీవితంలో కావాల్సిన మైత్రి, దయ, క్షమ, గురవములను పిల్లలు నేర్చుకుంటారు. మీరు అధ్యాపకులు కాని, తల్లితండ్రులు కాని, మీ పిల్లలను ART EXCEL కార్యక్రమంలో చేర్చడం, వాళ్లలో ఆథ్యాత్మకత, మానవ విలువలు, స్వీయ క్రమశిక్షణ, వ్యక్తిత్వ అభివృద్ధికి ఉత్తమ మార్గం.
ప్రయోజనాలు:
భయం, ఆందోళన, కోపం, చిరాకు వంటి ప్రతికూల భావావేశాలు అధిగమించుటకు, ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తి మెరుగు పరుచుకోనుతకు.
ఆనందం, సృజనాత్మకత పెంచుకొనుటకు.
వేదిక భయం అధిగమించుట.
సామూహికంగా కలిసి పనిచేయుట తెలుసుకొనుట, ఇబ్బందులు అధిగమించుట.
పరస్పర సహకారం.
రోజువారి సమస్యలను పరిష్కరించుటకు అతి సాధారణ సిద్ధాంతాలు.
ఊపిరి యొక్క, యోగా ధ్యానము యొక్క, ప్రాధాన్యత.
ప్రతిరోజు కొత్తవారితో మైత్రి పెంపొందించుట.
పూర్తి వ్యక్తిత్వ అభివృద్ధి.
ఆధ్యాత్మికత, భారతీయ సంస్కృతి తెలుసుకొనుట.
మానసిక ప్రశాంతతకు
ఏ విధమైన శ్వాస సమస్యలు లేకుండుట.
అవలోకనం :
వయస్సు : 8-13 సంవత్సరములు
కోర్సు వ్యవధి : 4-6 రోజులు
రోజుకు సమయం : 3-4 గంటలు
![Art Of Living Logo](/sites/all/themes/aol-zen/images/artofliving_logo.png)