చిన్న పిల్లలను, యుక్తవయసులో ప్రవేశిస్తున్న పిల్లలను తల్లిదండ్రులు సరిగా అర్ధం చేసుకోగలుగుతున్నారా? పిల్లలను సరైన దృష్టితో చూసి, వారి ప్రవర్తనను, వారిని ప్రభావితం చేస్తున్న విషయాలను తెలుసుకొనుటకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఒక చిన్న కార్యక్రమాన్ని రూపొందించింది. పిల్లలనును అర్ధం చేసుకుని వారికి తగినట్లుగా స్పందిస్తూ, తల్లిదండ్రులుగా మీ బాధ్యతను, ఉన్నతముగా, ఆనందముగా నిర్వహించుటకు తేలికపాటి పద్ధతులను నేర్చుకొనవచ్చును.
8 నుండి 13 సం. వయస్సు గల పిల్లల తల్లిదండ్రులకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది.
ఏ విషయం మీదైనా పిల్లలకు, పెద్దలకు గల దృష్టిలో చాలా తేడా ఉంటుంది. పిల్లల దృష్టి ఆశ్చర్యము, ఉత్సాహము, ఆనందము, అమాయకత్వము, అల్లరితో కూడి, ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, చాలా మామూలుగా ఉంటుంది. మొదట కొన్ని సంవత్సరాలు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పిల్లల వాతావరణాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారు. కాని ఏ విషయం గురించి అయినా పిల్లల మరియు పెద్దల దృష్టికి చాలా తేడా ఉంటుంది. కాలము గడచిన కొద్దీ పిల్లలు, చుట్టూ ఉన్న పరిస్థితులను మరి కొంచెము ఎక్కువగా అర్ధము చేసుకోవటం మొదలు పెడతారు. వారి పరిశీలనలో వారి అభిప్రాయాలను తెలియచెయ్యటం మొదలు పెడతారు. వారి ఆలోచనా విధానం పెద్దలకు సరిగా అర్ధం కాక, వారిని సరిగా అర్ధం చేసుకోలేదని పిల్లలు, పిల్లల ప్రవర్తన, చేష్టల వలన తల్లిదండ్రులు, విసుగు చెందుతూ ఉంటారు. ఇలా అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటుంది.
ఈ రకమైన విరుధ్ధ ఆలోచనలు ఎక్కువ అవుతూ కుటుంబ సంబంధ బాంధవ్యాలు తగ్గి కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరిగే అవకాశము ఉంది.
తల్లిదండ్రులు పిల్లలను సరైన రీతిలో అర్ధము చేసుకుని, కుటుంబ సంబంధాలు చక్కబడి వినోదముగా పెరగటానికి ‘మీ పిల్లలను అర్ధం చేసుకోండి’ అనే కార్యక్రమంలో రూపొందించిన పధ్ధతులు మీకు ఉపయోగపడతాయి. ఈ కార్యక్రమము పిల్లల ప్రవర్తన తీరుతెన్నులు తెలుసుకొని, వారి ప్రవర్తనకు గల మూల కారణములను విశ్లేషించి వారిలోని శక్తియుక్తులను పూర్తిగా వికసింపచేయటానికి తల్లిదండ్రులకు కావలసిన పరిజ్ఞానము కలుగచేస్తుంది. పిల్లలు పెరిగి యుక్తవయస్కులై, పెద్దవారు అయ్యాక కూడా కుటుంబములోని సంబంధాలు చక్కగా కాపాడుకోవటానికి సహాయపడుతుంది.
ఉపయోగములు
మీ పిల్లలను అర్ధం చేసుకోండి కార్యక్రమము తల్లిదండ్రులకు ఎలా సహాయము చేస్తుందంటే:
- మీ పిల్లలను చక్కగా అర్ధము చేసుకోవటము
- పిల్లలు వారికి తోచినట్టే ఏందుకు ప్రవర్తిస్తున్నారు
- పిల్లలను పెంచటంలో సరైన నిర్ణయాలు తీసుకోవటము
- మీరు పిల్లలతో విలువైన సమయము గడపటము
పర్యావలోకనము
3 గంటల పరిచయ కార్యక్రమము
అర్హతలు
- ఏమీలేవు