మీ పిల్ల్లల గురించి సరియైన అవగాహన తెచ్చుకోండి!
తల్లి తండ్రులకు ప్రత్యేకమైన 2 గంటల శిక్షణా తరగతుల ద్వారా తమ పిల్లల పెంపకానికి ఉపయోగ పడే మార్గ దర్శనం తో పాటు మీ పిల్ల్లల గురించి సరియైన అవగాహన తెచ్చుకొనే అవకాశం.
ఈ శిక్షణలో పిల్లల ప్రవర్తనా ధోరణులను సరిగ్గా గమనించి పిల్లల పెంపకానికి తల్లిదండ్రులు ఎలాంటి పద్దతులు అనుసరించాలి అనే విషయాలపై ద్రిష్టి సారిస్తారు. 8 నుండి 13 వయసు పిల్లలకు 14 నుండి 17 వయసు గల పిల్లలకు వేర్వేరు శిక్షణ తరగతులతో ఈ వయసు పిల్లల ఆలోచనా ధోరణులను అర్థం చేసుకుని తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి అనేది తెలుసుకోగలుగుతారు.
ఆర్ట్ ఎక్సెల్ ( 7 నుండి 13 సం ల వయసు వారికి)
ఆర్ట్ ఎక్సెల్ శిక్షణ వల్ల ఈ వయసు పిల్లల సంపూర్ణమైన వికాసానికి దోహదపడే ప్రక్రియలు నేర్పిస్తారు. దీనివల్ల మానసిక శాంతి, స్పష్టత, శారీరక విశ్రాంతి మరియు తమ భావాలు స్థిరంగా ఉండటానికి ఉపయోగ పడతాయి. ఈ శిక్షణలో పిల్లలతో ఆటలు మరియు ప్రాయోగిక పద్దతుల ద్వారా తన తోటి పిల్లలతో ఎలా మెలగాలి అలాగే స్నేహ,సౌభాతృత్వ వాతావరణం ఎలా తీసుకురావాలి అనేది నేర్పిస్తారు. పిల్లలు తమ ఆలోచనా ధోరణులు ప్రకటించే విధంగా అలాగే భిన్నమైన సముదాయం లో ఎలా ఉండగలరు అనేవి స్వాభావికంగా అలవర్చు కొనేవిధంగా తీర్చిదిద్దబడుతారు. ప్రతి రోజూ ఒక కొత్త స్నేహితున్ని కలుపుకొని అలాగే స్వచ్చందంగా మిగతా వారికి ఎలా తమ వైపు నుండి సహాయపడాలి మొదలైన ప్రాయోగిక పద్దతుల ద్వారా పిల్లలలో మానవతా విలువలు పెంపొందించబడతాయి.
యువ సాధికారిత పెంపొందిచే సదస్సు -ఎస్! (14 నుండి 17 సం ల వారికి)
ఎస్! అని పిలువబడే ఈ కోర్సు 14 నుండి 17 సం ల వయసు వారికి ఆరోగ్యకరమైన శరీరం, మనసు మరియు మంచి జీవన శైలి అలవరచు కొనే విధంగా కూర్ప బడింది. ప్రాయోగిక పద్దతుల ద్వారా భావోద్వేగాలు మరియు ఒత్తిడిల నుండి ఎలా ముందుకు వెళ్ళటమనేది యువతకు నేర్పుతారు. వీటి వల్ల ప్రధాన ఉపయోగమేమంటే యువతలో ఆత్మా విశ్వాసం పెంపొందించి అన్ని సందర్బాలోలోనూ సరియైన నిర్ణయాలను తీసుకోవడానికి ఉపయోగపడి తమ విద్యభాసంలో మరియు జీవితంలో సవాళ్ళను ఎదుర్కోవడానికి వారికి తోడ్పడుతుంది.
ఈ కాలంలో పిల్లలు భావోద్వేగమైన సమస్యలైనటువంటి ఆత్మ గౌరవం లేక పోవటం,డిప్రెషన్, ఆందోళన మొదలైన వాటితో సతమతమవుతూ ఉండటం చూస్తున్నాము. వీటికి సరియైన పరిష్కారం లేదనుకుని యువత తాగుడుకి, మత్తు మందులకి, పొగ తాగటానికి అలవాటు పడటంతోపాటు వారిలో హింసాత్మక ధోరణులు పెరిగి దూకుడు తో వ్యవహరించటం చూస్తున్నాము. వీటి వల్ల యువత నెమ్మదిగా సమాజానికి దూరమవడం కూడా జరుగుతూ వున్నాయి.
యువతలో ఒత్తిడి తగ్గి భావోద్వేగాలను సమతుల్యంగా తీసుకోగలిగి అటు విద్యాభాసంలోనూ ఇటు అందరితోనూ కలిసి మెలిసి ఉండటం లోనూ వీరిని తయారు చేయటంలో ఈ కోర్సు ఉపయోగ పడుతుంది.
- ఆర్ట్ ఎక్సెల్ మీద అభిప్రాయాలు
- ఎస్+ మీద అభిప్రాయాలు
"ఆర్ట్ ఎక్సెల్ కోర్సు పిల్లలలో పూర్తి విశ్రాంతి కలుగచేసి వారికి వారి వారి జీవిత పయనాన్ని అన్ని క్లిష్ట పరిస్తితులలోను సరియైన రీతిలో ముందుకు తీసుకు పోవడానికి సహాయపడుతుంది. ఈ కోర్సును అందరు పిల్లలకు నేర్పాలని నేను కోరుకుంటున్నాను."
-- మేరీ డైమండ్, విల్సన్ ప్రాధమిక పాటశాల, స్టూడెంట్స్ కార్యక్రమాల సమన్వయకర్త"ఆర్ట్ ఎక్సెల్ కోర్సు పిల్లల కోసం కూర్పబడిన ఒక మహత్తరమైన వరం.దీనివల్ల పిల్లలు అందరితోనూ కలిసి మెలిసి ఉండడంతో పాటు వైవిధ్యమైన వయసు వారితోపాటు భిన్న సంప్రదాయాలకు అనుగుణంగా ఎలా మెలగాలి అని తెలుసుకోగలుగుతున్నారు."
-- రమోల ప్రభు, (ఎం డి)"ఇక్కడికి వచ్చే ముందు ప్రతి చిన్న విషయానికి నాకు కోపం రావడం జరిగేది. ఇప్పుడు శ్వాస ద్వారా మనసుని ఎలా నియంత్రిచాలో అలాగే అనవసరపు ఆలోచనలను ఎలా వదిలేయాలో తెలుసుకున్నాను."
మాట్, స్కూలు విద్యార్ధి"My experience with the YES! program was revolutionary. The things that I learned here taught me not only how to become a better person, but how to not let others stop me from being a better person…I greatly appreciated and enjoyed this experience."
-- Tameika, McKinley Technology High School"YES! has helped to create that culture of calm we really want our school to have. The [stress management] strategies taught on YES! are not just used in the classroom, they are life-skills that the students and staff can use outside of the classroom as well."
-- Ms. Tamara Littlejohn, Walt Disney Magnet School, Chicago"Getting YES! in school at this grade level treats it like curriculum, which is what it should be. It tells a kid it is as important for you to learn life management and stress management skills, as it is to learn math."
-- Susan Bertucci, Parent, Chicago