భారతదేశ ప్రభుత్వ విధాన౦లో చాలా మార్పులు సంభవిస్తున్నాయి. ఈ రోజులలో చాలాసంస్థలు తమలక్ష్యాలను చేరుకోవడానికి విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నాయి. కానీ, అందుకు సరిపోయే వాతావరణం మరియు మానవవనవరులు లేవు. మార్పు అనేది వ్యక్తి దగ్గరే మొదలౌతుందని మేము నమ్ముతాము. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన దైనందిన కార్యకలాపాలలో అనేక విధాలుగా ఒత్తిడికి గురి అవుతుంటారు. ఇది వారి సామర్థ్యానికి మరియు సమర్థతకు సవాలుగా మారుతుంది. ఒత్తిడి అనేది పని దగ్గరే కాకుండా ఇంట్లో మరియు బయట కుడా ఉ౦టుంది. ఇది మనిషి అరోగ్యము, సామర్థ్యము మరియు నైతికత మీద కూడా ప్రభావంచూపిస్తుంది. తరచుగా ఈ ఒత్తిడిని తట్టుకోవడానికి కావలసిన నైపుణ్యాలను మరియు పద్దతులను నేర్చుకొని సమర్థవంతమైన మరియు అర్థవంతంగా జీవి౦చాలనిపిస్తుంది. ఈ ఒత్తిళ్లు సంస్థయొక్క పనితీరుపై ప్రభావము చూపిస్తాయి. ఏయే సంస్థలైతే సానుకూల పనివాతావరణం మరియు ఉద్యోగుల ఆలోచనాధోరణిలో మార్పు కోరుకుంటూన్నాయో , వాటికి ఆర్ట్ అఫ్ లివింగ్ సహాయ, సహకారాలను అందిస్తుంది.
గెప్(GEP) అనేది ఆర్ట్ అఫ్ లివింగ్ వారి ప్రధానమైన కార్యక్రమం. ఇది కేంద్ర మరియు రాష్ట్రప్రభుత్వ సంస్థలు , వాటి కింద పనిచేయు విభాగాలు, స్వయంప్రతిపత్తి గల సంస్థలు, సాయుధ/రక్షణదళాలు మరియు శిక్షణ సంస్థలకు ఉద్దేశించి రూపొందించినది.
గెప్ అనేది ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగుల అవసరాలు మరియు వారి దైనందిన సవాళ్ళను దృష్టిలో ఉ౦చుకొని రూపొందించినది. ఈ కార్యక్రమము చాలాస్థాయిల్లో ప్రభావం చూపిస్తుంది - వ్యక్తిగతస్థాయిలో, పని చేసే వాతావరణంలో మరియు మొత్తం సంస్థ పైన వుంటుంది. ఈకార్యక్రమం, అనాదిగా వస్తూ మరియు ఎప్పటికీ వుండే జ్ఞానము నుండి తీసుకోబడిన ఆచరణకు సులువుగా వుండే సమర్థవంతమైన పద్దతులతో రూపొందిచబడినది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను అందుకున్న కార్యక్రమము. ఇది అన్నిరకాల మత విశ్వాసాలకు, వయో లింగ భేదములకు అతీతంగా వుంటుంది.
ఇప్పటివరకు, వందలాది కేంద్ర మరియు రాష్ట్రప్రభుత్వ అధికారులు ఈకార్యక్రమం ద్వారా లబ్ధిని పొందారు. DoPT, హోంశాఖ, విదేశీవ్యవహారాలశాఖ, ఆర్ధికశాఖ, రక్షణశాఖ ,రైల్వేస్, పౌరవిమానయాన , యువత వ్యవహారాలశాఖ, గనులశాఖ, విద్యుత్ శాఖ, రహదారులు మరియు ఇతర శాఖలు. ఇంకా చాలా శిక్షణ సంస్థలు, PSUలు , రక్షణ దళాలు, సైన్యము, CVS, CEC మొదలైన స్వతంత్ర సంస్థలు , సచివాలయ కార్యదర్శులు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందారు. మా అంతర్గత నివేదికల ద్వారా తెలిసిన విషయం, ఈ కార్యక్రమములో పాల్గొనిన వారిలో అత్యధికులు వొత్తిడి లేకుండా, ఉత్సాహంగా వుంటూ, మానసిక ఏకాగ్రతను మరియు స్పష్టతను సాధించారు. పని వాతావరణంలో స్పష్టమైన ప్రభావం కనిపించింది.
అది ఎలాగంటే , ఈ కార్యక్రమంలో పాల్గొనిన 90% కంటే ఎక్కువమంది, కొత్త సవాళ్ళను ఎదుర్కొనే సంసిద్ధతను, అధిక సామర్థ్యం మరియు తోటి వారితో సత్సంబంధాలు కనపరచారు. ముఖ్యంగా 80% మంది ఈ కార్యక్రమం ఒక సానుకూల పనివాతావరణం సృష్టిస్తుందని, మరింత ఉన్నత నైతిక ప్రవర్తనకు దారితీస్తూ, సంస్థ అభివృద్ధికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు.
Wఇంకాలోతైన చర్చకు మరియు వివరాలకు మీకు అందుబాటులో ఉంటాము. మీ పిలుపును సంతోషంగా స్వేకరిస్తాము. మా ఈమెయిలు: gep@vvki.net చరవాణి(mobile):9910299690