మా సాధికార విధానము

మేము మనుష్యులను మారుస్తున్నాము 

యువ నాయకత్వ శిక్షణ శిబిరం (YLTP)

ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత దేశంలో అత్యధిక శాతం యువత ఉన్నారు. దాదాపు 40 శాతం భారతీయులు యువకులు (నేషనల్యూత్ పాలసీలో పేర్కొన్న ప్రకారం) మా ‘యువ నాయకత్వ శిక్షణ శిబిరం’ ద్వారా వారు ఆదర్శవంతులుగా తయారవుతున్నారు. మా ఆచరణాత్మక శిక్షణ తరగతుల ద్వారా, గ్రామాలలో, గిరిజన సంఘాలలోని యువతీ యువకులు సామాజికంగా, ఆర్ధికంగా స్వతంత్రులై ఆత్మవిశ్వాసం పొంది, మార్పు కోసం ఎంతో ఉత్సాహంతో పని చేయటానికి శక్తివంతులుగా తయారవుతున్నారు. వారి మానవీయ విలువలు చైతన్యపరచటం ద్వారా, వారి మానసిక శక్తి ఉత్తేజితం చేసి, శారీరక ఆరోగ్యాన్ని, వృత్తి నైపుణ్యాలను పెంచి, వారిని ప్రకృతి వనరుల స్ధిరనిర్వహణ వైపు మళ్ళిస్తున్నాము.

మన యువతే మన భవిష్యత్తు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాలకు చేయూతనివ్వటం ద్వారా, భారత దేశ భవిష్యత్తుకు పెట్టుబడి పెట్టండి.

 

నేటికి మనం సాధించే ఘన విజయాలుః  ( భారత దేశం):

    • గ్రామీణ యువతకు 110,000  లకు పైగా శిక్షణా కార్యక్రమం చేపట్టాము
    • మారుమూల గ్రామాలకు 40,000 లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి చేయూత నందించాం.
    • 2.3 మిలియన్లకు పైగా చెట్లు నాటడం జరిగింది
    •  నిరాశ్రయులుగా ఉన్నవారికి 1800 పైగా ఇల్లు, 5,400 లకు పైగా మరుగు దొడ్లు,  1100
      బోరుబావులు  త్రాగు నీటిని 900  లకు పైగా బయోగ్యాస్ యంత్రాలు అందించడం జరిగింది
    • 48,000 లకు పైగా పరిసరాల శుభ్రత సంరక్షణా శిబిరాలు,  23000 లకు పైగా ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరిగింది.  ఇందులో  2.5 మిలియన్లకు  పైగా ప్రజలు లబ్ధి పొందారు
    • 55 మారుమూల గ్రామాలను తీసుకొని ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చి దిద్దడం జరిగింది

 
Founded in 1981 by Sri Sri Ravi Shankar,The Art of Living is an educational and humanitarian movement engaged in stress-management and service initiatives.Read More