మీరు పని చేస్తున్న సంస్థకు ఈ మధ్య వచ్చిన మంచి ఫలితముల వలన సంస్థ సభ్యులకు, ఉద్యోగస్తులకు అందరికి విందు ఏర్పాటు చేసారు. మీరు చక్కటి సాయంత్రపు గును వేసుకుని, దానికి తగినట్లు నగలు ధరించి, మంచి ఎత్తు మడమల బూట్లు కూడా వేసుకుని అలంకారాన్ని పూర్తి చేశారు. చాలా చక్కగా కనిపిస్తున్నారు. అందరు మిమ్మల్ని ఆరాధనగా చూస్తూ పొగుడుతూ ఉన్నారు. అంతా బాగానే ఉంది మీరు మీ నోటి దుర్వాసనను గమనించేవరకు. దుర్వాసన అన్నది అప్పుడే మొదలైనట్టు ఉన్నది! అక్కడ ఉన్నవారు కూడా దీనిని గ్రహించి, సంభాషణను కుదించి త్వరగా దూరము జరుగుతున్నారు. మీరు మీ పై అధికారులను మెప్పించుటకు తగిన సమయము హఠాత్తుగా నష్టము కలిగించే విధముగా మారిపోయింది.
ఉత్తమమైన దంత శుభ్రతకు చిట్కాలు:
- ప్రకృతి సిద్ధమైన టూత్ పేస్టు తో మీ పళ్ళను రోజు రెండు సార్లు శుభ్రము చేసుకోవాలి
- నాలుక మీద పేరుకున్న వ్యర్థములను తొలగించడానికి నాలుక బద్ధము వాడవలెను
- ఆహారము తిన్న ప్రతిసారి నీటిలో నోరు పుక్కిలించి శుభ్రము చేసుకోవాలి
- మంచి నీళ్ళు ఎక్కువగా తాగాలి
- మాదక ద్రవ్యములు, పొగాకు వంటి పదార్థములకు దూరంగా ఉండాలి
- ఆహారము తక్కువ తీసుకుని, బాగా నమిలి మింగాలి
- ఉల్లిపాయ, వెల్లుల్లి ఉన్న ఆహార పదార్థములను తగ్గించాలి
- అనారోగ్యమైన (జంక్ ఫుడ్ ) ఆహారము తీస్కుకోరాదు
- ప్రతిరోజు యోగసాధన చెయ్యాలి
మన అందరం జీవితంలో ఈ పరిస్థితిని అనుభవిన్చిన వాళ్ళమే. వైద్యుల భాషలో నోటిదుర్వాసన , చేడ్డవాసన గల ఊపిరి అన్న దురద్రుష్టకమైన స్థితి. దీనివాలన మీరు ఆత్మవిశ్వాసము కోల్పోయి హాయిగా జీవించలేరు. నోటిదుర్వాసన అన్నది దంతధావనము సరిగా చేయకపోవటము వలన వస్తుంది. అది చాలా మంది అభిప్రాయము కాని అది పూర్తిగా నిజాము కాదు. ఆహారము వేలకు తీసుకుపోవటము, జీర్ణప్రక్రియ సరిగ్గా లేకపోవటము, మంచి నీళ్ళు తక్కువగా తీసుకోవటము, మనము తీసుకునే ఆహారములో తేడాలు కూడా నోటి దుర్వాసనకు కారనములు. నోరు లోపల తడిగా ఉన్న వారికన్నా నోరు పొడిగా ఉన్న వారిలో దుర్వాసనకు అవకాశము ఎక్కువ అని పరిశోధకుల నమ్మకము.
పొగ త్రాగాతము , మత్తు పదార్థములు సేవించుట కూడా నోటి దుర్వాసనకు కారణము. నాలుక మీద పేరుకుపోయిన తెల్లని పదార్థము వలన నోటిలో సూక్ష్మక్రిములు చేరి నోటి దుర్వాసనకు కారణం అవుతాయి.
మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నపటికీ, నోటి పరిశుభ్రతను చాలా జాగ్రత్తగా పాటించినప్పటికీ మరల మరల నోటి దుర్వాసన వస్తున్నదని మీరు గ్రహించినప్పుడు ఆ సమయములో యోగా అన్నది కూడా ముఖ్యమైన, ఎన్నుకోతగిన విషయముగా మీరు తెలుసుకోవాలి. యోగ అన్నది శారీరక సంబంధమైన వ్యాయామము అని మనకి అవగాహన ఉన్నప్పటికీ, దాని వలన నోటి దుర్వాసన వంటి సమస్యలు కూడా పరిష్కరింపబడతాయి. యోగ మీ శరీరమును బయట లోపల కూడా శుభ్రపరుచుటకు సహాయపడుతుంది. ఇది మీ మనస్సుని ప్రశాoతముగా చేసి, మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ రెండు రోజులు 10 గంటల పాటు సాగే ఆరోగ్యముగా జీవించటము అనే ఈ కార్యక్రమము శారీరకమైన బాధను మరియు మానసిక వొత్తిడిని తొలగించుటకు సహాయ పడుతుంది. మీ జీవన విధానమును అనుసరించి, మీకు అవసరమైనంత వరకు శిక్షణ పొందిన బోధకుల ద్వారా ఈ యోగ కార్యక్రమము నిర్వహింపబడుతుంది. ఈ కార్యక్రమము కొత్తగా నేర్చుకున్న వారు కూడా తేలికగా ఇంటి వద్దనే హాయిగా సాధన చేయగలరు.
కొన్ని రకములైన యోగ ముద్రలు మీ నోటి దుర్వాసనను ఆపటానికి సహాయం చేస్తాయి
